calender_icon.png 21 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బుతో ప్రేమను కొనొచ్చు.. కానీ!

21-11-2024 12:00:00 AM

ప్రస్తుతం ఏ సంబంధమైనా ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి నీనా గుప్తా డబ్బు ఆవశ్య కత గురించి మాట్లాడారు. డబ్బుతో దేన్నై నా కొనొచ్చు. చివరకు ప్రేమను కూడా అని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని పిల్లలకు నేర్పించవద్దని సూచించారామె.  ‘వాట్ విమెన్ వాంట్’ అనే టాక్ షోలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచు కున్నారు. “చిన్నప్పట్నుంచే డబ్బు గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ పెరిగా.

అయితే డబ్బుతో దేన్నైనా కొనవచ్చని భావిస్తుంటారు చాలా మంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చు. కానీ ఆమో దయోగ్యమైనది కాదు. డబ్బు గురించి పిల్లలకు తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దు. కరిష్మా లేదా సైఫ్ అలీఖాన్‌కు చెప్పేది ఇదే.. నా పిల్లలకు కూడా చెప్పాలనుకుంటున్నా” అన్నారు. అలాగే ఆర్థిక భద్రత గురించి ప్రస్తావి స్తూ.. ‘నా భర్త చాలా మంచివాడు. అతను నా కోసం చాలా చేస్తాడు.

అతనిపై నాకు ఎటువంటి సందేహం లేదు. పూర్తి నమ్మకం ఉంది’ అంటూ చాలామంది మహిళలు డబ్బు గురించి పట్టించుకోవడం లేదని, ఇది తెలివితక్కువ పని అని నీనా అన్నారు. భర్త సంపాదిస్తున్నప్పటికీ గృహిణిగా మహిళలు తమ అవసరాలను గుర్తించాలన్నారు.