వాటర్ డైట్‌తో కూడా బరువు తగ్గొచ్చు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. పొట్ట నిండా నీళ్లు ఉండేలా చూసుకోండి. ఇలా నీళ్లు తాగాడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆకలిని అరికడుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు హైక్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే, నీరు తాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవచ్చు.
ఆకలి తగ్గుతుంది. వాటర్ డైట్‌తో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్. బెవరెజ్‌కు బదులుగా నీళ్లు తాగాలి. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత నీళ్లు తాగాలి. ముందు నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది. తర్వాత తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ దొరుకుతుంది. బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే, త్వరగా బరువు తగ్గుతారు. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకుంటే చాలా మంచిది.