ఏసీబీ విచారణలో కేటీఆర్‌కు ఊరటనిచ్చిన హైకోర్టు
- ఆడియో, వీడియో చిత్రీకరణకు నిరాకరణ
- విచారణ 20కి వాయిదా
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి భారీమొత్తంలో ప్రజాధనాన్ని అక్రమ మార్గంలో విదేశీ కంపెనీకి చెల్లించారన్న అభియోగంతో మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై నమోదైన కేసు దర్యాప్తునకు.. ఆయన వెంట న్యాయవాది వెళ్లేం దుకు హైకోర్టు బుధవారం అనుమతిచ్చిం ది.
ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని.. అయితే, కేటీఆర్‌ను విచారించేటప్పుడు ఆయన పక్కన ఆ న్యాయవాది ఉండేందు కు అనుమతించరాదని ఏసీబీని ఆదేశించింది. ఏసీబీ విచారణ ను న్యాయవాది చూడవచ్చునని, విచారణ లో జోక్యం చేసుకోవడంగానీ, విచారణ జరిగే గదిలోకి న్యాయవాది వెళ్లడంగానీ చేయరాదని షర తు విధించింది.
ఏసీబీ దర్యాప్తును ఆడి యో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ రావు చేసిన వినతిని తిరస్కరించింది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో ఆడియో, వీడియో చిత్రీకరణకు ఇదే హైకోర్టు అనుమతిచ్చిందని న్యాయవాది గుర్తుచేశారు.
ఆ కేసులో సీబీఐ దర్యాప్తు ఆఫీసర్‌గా ఐపీఎస్ అధికారి ఉన్నారని, అవినాష్‌రెడ్డి స్టేట్‌మెంట్‌లోని కొన్ని అంశాలను డిలీట్ చేయడం లేదా చెప్పని విషయాలను యాడ్ చేయడమో జరుగుతోందనే తీవ్ర అభియోగాల కారణంగా ఆ తరహా ఉత్తర్వులు తానే ఇచ్చినట్లు న్యాయమూర్తి చెప్పారు. గురువారం ఏసీబీ దర్యా ప్తునకు పిటిషనర్ హాజరైన తర్వాత పరిస్థితులు ఆశించిన విధంగా లేవని భావిస్తే పిటిషనర్ ఈ నెల 10వ తేదీనే హైకోర్టుకు రావచ్చునని చెప్పారు.
కేటీఆర్ వెంట వెళ్లే న్యాయవాది పేరు ఇవ్వాలని, మూడు పేర్లు ఇస్తే వాళ్లల్లో ఒకరిని అనుమతించేందుకు ఉత్తర్వులు ఇస్తామని కేటీఆర్ న్యాయ వాదికి చెప్పింది. కేటీఆర్ వెంట సీనియర్ అడ్వొకేట్ జే రామచందర్‌రావు హాజరవుతారని పిటిషనర్ లాయర్ చెప్పారు. అనం తరం హైకోర్టు, కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని ఏసీబీని ఆదేశించింది.
ఏసీబీ దర్యాప్తు అధికారి కేటీఆర్‌ను విచారించేప్పుడు వాళ్లిద్దరూ కనబడేలా.. న్యాయ వాది ఉండేలా ఏర్పాటు చేయాలంది. ఆ దర్యాప్తులో న్యాయవాది జోక్యం చేసుకోరాదని, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, కేవలం కేటీఆర్‌ను ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే కనబడే దూరంలో ఉండి న్యాయవాది చూ డాలని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని తనతో పాటు కూర్చొనేందుకు న్యాయవాదికి అనుమతివ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో కేటీఆర్ లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యాహ్నం 2.15 సమయంలో విచారణ చేపట్టారు.
న్యా యవాదిని అనుమతిస్తే నిందితుడైన పిటిషనర్‌ను దర్యాప్తు అధికారి విచారణ చేస్తుంటే చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయో లేవో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డిని ఆదేశించింది. సాయం త్రం 4 గంటలకు మరోసారి విచారణ జరిగినప్పుడు..
కేటీఆర్ వెంటన న్యాయవాదిని అనుమతించరాదని రజనీకాంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దర్యా ప్తు అధికారి, కేటీఆర్ ఒక గదిలో ఉంటే మరో గదిలో న్యాయవాది ఉంటారని, దర్యా ప్తు జరిగే గదిలోకి న్యాయవాది వెళ్లనప్పుడు మీకొచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై దర్యాప్తు జరిపేప్పుడు న్యాయవాదిని అనుమతించామని, సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేసింది. దర్యాప్తులో న్యాయ వాది జోక్యం చేసుకునేందుకు వీల్లేనప్పుడు పిటిషనర్ వెంట న్యాయవాది వెళితే వచ్చే నష్టమేమిటని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ నెల 6వ తేదీన ఏసీబీ దర్యాప్తు నకు న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళితే పోలీసులు అనుమతించకపోవడాన్ని సవా లు చేస్తూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేశారు. దీనిని విచారణ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసు లో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణలో న్యాయవాదిని అనుమతించేందుకు ఉత్తర్వులు జారీచేసినట్లు హైకోర్టు గుర్తుచేసింది.
కేటీఆర్‌ను ఏసీబీ విచారించే సమయంలో చేపట్టేప్పుడు ఆడియో, వీడియో చిత్రీకరణ చేయాలని సీనియర్ న్యాయవాది ప్రభాకర్‌రావు కోరగా అందుకు నిరాకరించింది. న్యాయవాది సమక్షంలో ఏసీబీ దర్యాప్తు కావాలా లేక కేటీఆర్ విచారణ చేసేప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్ కావాలా ఏదో ఒక్కటే రిలీఫ్ ఇవ్వగలమని తేల్చిచెప్పింది.
ఏపీకి చెందిన రాజకీయ నేత అవినాష్‌రెడ్డి కేసులో ఆ రెండూ ఇచ్చారని న్యాయవాది గుర్తుచేశారు. అవినాష్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసింది ఐపీఎస్ అధికారని, అవినాష్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను డిలీట్ చేయడం, లేని విషయాలను చేర్చడం వంటివి జరిగాయనే తీవ్ర అభియోగాల నేపథ్యంలో ఆ విధంగా ఆర్డర్ ఇవ్వాల్సివచ్చిందని హైకోర్టు చెప్పింది.
ఈ నెల 9న గురువారం కేటీఆర్ ఏసీబీ దర్యాప్తునకు వెళ్లాక ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 10వ తేదీన తిరిగి హైకోర్టుకు రావచ్చునని వారికి వెసులుబాటు ఇచ్చింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.