calender_icon.png 20 April, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో ఒత్తిడిని జయించవచ్చు

17-04-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్16 (విజయక్రాంతి): నిత్యం ఒత్తిడితో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో దాన్ని నియంత్రించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆధునికరించిన బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులను ఎస్పీ డీవీ శ్రీనివా స్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివా రి, అదనపు ఎస్.పి. ప్రభాకర్ రావు , ఏఎస్పి చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  క్రీడలు ఆడడంతో ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు దోహదపడతాయని అన్నారు. నిత్య జీవితంలో క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని, శారీరక ధారుఢ్యం, మానసిక ఉల్లాసం కలగడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

పోలీస్ హెడ్ క్వార్ట ర్స్‌లో ప్రారంభించిన బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులను పోలీసు అధికారులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు.  కార్యక్రమంలో  సింగరేణి జీఎం విజ య్ భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఐలు పెద్దన్న, అంజన్న, సీఐలు రవీందర్, శ్రీధర్ పాల్గొన్నారు.