బరువు తగ్గడానికి పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలను కూడా పాటిస్తే చాలు. ఉదయం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ రోజంతా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటుంది. సాధారణంగా ఉదయం చాలామంది కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుం టారు.
కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ కార్బోహైడ్రేట్లు తక్కువ గా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ప్రాథమిక పోషకాలలో ఒకటి అయినప్పటికీ, ఇది అధికంగా తీసుకుం టే కొవ్వుగా మారుతుం ది. కాబట్టి కార్బోహై డ్రేట్లు తక్కువగా తీసు కోండి. అలాగే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకో వాలని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ జీర్ణక్రియ, జీవక్రియను మెరు గుపరుస్తుంది. బరువు తగ్గించడంలో మంచినీరు ఒకటి. ఇది కేవల బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా శరీర అవయవాలు, ముఖ్యంగా పేగు కదలికల సక్రమంగా పనిచేసేలా చూసుకుంటుంది. అందుకే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. తగినంత నిద్ర కూడా అవసరం.