అధికార, ప్రతిపక్షాల విమర్శలు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ మండుతోంది. ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని అధికార, విపక్షాలు నిందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. అంతకు ముందు కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం వల్లే మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నాయని ఆరోపించారు. శాంతి భద్రతలు క్షీణించాయని జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ముర్మకు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.