29-04-2025 01:32:16 AM
ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనపై , పోలీస్ వ్యవస్థపై కేసీఆర్ చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని అనడం వి డ్డూరంగా ఉందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో పోలీసులను తొత్తులుగా వాడుకు ని, చట్టవిరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించిన విషయం మర్చిపోయారా..? అని సోమవారం ఆమె ఎక్స్ వేదికగా విమర్శించారు.
మీ ఉచ్చులో పడిన కొందరు పో లీసు అధికారులు హద్దులు దాట డం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఎద్దేవాచేశారు. బీఆ ర్‌ఎస్ పెట్టడానికి ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఒక్కొక్కరి ఆస్తులు ఎన్ని వేల కోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్‌ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.