11-04-2025 12:00:00 AM
రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘మాస్ జాతర’. దీనికి ‘మనదే ఇదంతా’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
శ్రీలీల కథానా యిక. ఈ చిత్రం మే9న థియేటర్లలో విడుదల కానుంది. తాజా గా ఈ సినిమాకు సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ ఆరంభించేం దుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ మేరకు తాజాగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్‌గా ‘తూ మేరా లవర్..’ అంటూ సాగే పాటను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చుతున్నారు.