- ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళకు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ అసభ్యకర మెసేజ్‌లు
- సీఐని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): మహిళల భద్రతను కాపాడ టానికి ‘షీ’ టీమ్‌లను ప్రవేశపెట్టిన పోలీసులే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం కోసం వచ్చిన వారిని పడక సుఖం కావాలని హింసిస్తున్నారు. ‘మేము పోలీసులం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ కేసు విషయమై ఫిర్యాదు చేయడానికి పోలీ స్ స్టేషన్‌కు వచ్చిన మహిళకు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పురేందర్ రెడ్డి అసభ్యకర మెసేజ్‌లు చేశాడు.
సనత్‌నగర్‌లో నివాసముండే మహిళ ఓ కేసు విషమమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. మహిళ ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ పురేందర్‌రెడ్డి ఆమె తో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ‘అందంగా ఉన్నావు.. నేను చెప్పిన ప్లేస్‌కి రావాలి’ అంటూ అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడు. తాను అలాంటి దాన్ని కాదని చెప్పినా సీఐ వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబా ద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసి, సీఐ తనతో చేసిన చాటింగ్‌ను సీపీకి చూపించింది. దీంతో విచారణ చేసి సదరు సీఐని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.