calender_icon.png 11 January, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూన్‌కు తప్పిన పదవీగండం

08-12-2024 12:36:06 AM

* అభిశంసన తీర్మానం రద్దు

* సౌత్ కొరియా అధ్యుక్షుడికి రిలీఫ్

* ఓటింగ్‌ను బహిష్కరించిన అధికార పార్టీ

సియోల్, డిసెంబర్ 7:  సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీగండం తప్పింది.  దేశంలో ఎమజర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించడంతో ఆయనపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే అభిశంసన తీర్మానాన్ని అధికార ‘పీపుల్ పవర్ పార్టీ’ బహిష్కరించింది. దీంతో అభిశంసన నుంచి అధ్యక్షుడు బయటపడ్డారు.  పార్లమెంట్‌లో మొత్తం 300 సభ్యులు ఉన్నారు. 

ప్రతిపక్ష పార్టీలకు192 సభ్యులు మాత్రమే ఉన్నారు. తీర్మానానికి 200 మంది సభ్యులు మద్దతు పలకాలి. అయితే తీర్మానంపై ప్రతిపక్షాలకు తోడు అధికార పార్టీకి  చెందిన ముగ్గురు మాత్రమే  ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఓట్ల సంఖ్య200కు చేరకపోవడంతో  బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దయింది. ప్రతిపక్షాల చేతుల్లోకి అధ్యక్ష పదవి పోకూడదనే ఓటింగ్‌ను బహిష్కరించినట్లు తెలిసింది.  అయితే చాలామంది అధ్యక్షుడి అభిశంసనకు మద్దుత ఇస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడయింది. కాగా  దేశంలో మార్షల్ లా విధించినందుకు తనను దేశ ప్రజలు క్షమించాలని అధ్యక్షుడు యూన్ సుక్ యోల్  కోరారు. మరోసారి ఇలాంటి తప్పే చేయనని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ బహిరంగ క్షమాపణలు తెలిపారు.  మారోసారి మార్షల్‌ను విధించబోనని ఆయన హామీ ఇచ్చారు.