నడ్డాతో డిప్యూటీ సీఎం, స్టేట్ చీఫ్ కీలక భేటీ
యోగి తీరే ఓటమికి కారణమని వస్తోన్న ఆరోపణలు
యూపీలో బీజేపీ బలహీనపడింది: అఖిలేశ్
లక్నో జూలై 17: ఉత్తరప్రదేశ్ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో యూపీలో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈ సారి చేతులెత్తేసింది. ముఖ్యంగా రామమందిరం ఉన్న ఫైజాబాద్ స్థానంలో ఓటమి పార్టీని మరింత కుంగదీసింది. మొ త్తం 80 సీట్లలో ఎస్పీ, కాంగ్రెస్ కలిపి 43 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 36 సీట్లు దక్కించుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య ప్రచ్ఛన్న యు ద్ధం నడుస్తోంది. యోగి పనితీరుపైనా పలువురు పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నట్లు వి శ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
రాజీనామా చేస్తా..
ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో కేశవ్ బుధవారం సమావేశమయ్యారు. యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికలకు ముందు పార్టీ వ్యూహా న్ని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. యోగి క్యాబినెట్‌తో పాటు బీజేపీ యూనిట్‌లో కూడా పెద్ద మార్పు వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి మార్పు విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. ఉపఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.
కేశవ్ సంచలన వ్యాఖ్యలు
గతవారం లక్నోలో బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేశవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కన్నా పార్టీ ఎప్పుడూ పెద్దదని కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో సహా కొంతమంది నాయకులు యోగి పనితీరును విమర్శించారు. ఆయన తీరే ఓటమికి కారణమని ఆరోపించారు. బీ జేపీలో యోగి బలమైన నేతగా కనిపిస్తున్నప్పటికీ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యమివ్వటం లేదనే వార్తలు వస్తున్నాయి. యోగి సీఎం సీటుపైనా అనుమానాలు నెలకొన్నాయి.
రాష్ట్రంలో బలహీనంగా బీజేపీ
యూపీ బీజేపీలో గలాటాను ఉద్దేశించి ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ విరుచుకుపడ్డారు.