calender_icon.png 16 November, 2024 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగి మహా చిచ్చు!

16-11-2024 02:30:36 AM

  1. యూపీ సీఎం నినాదంపై కొనసాగుతున్న రచ్చ
  2. బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్న నేతలు
  3. ప్రధాని సభకు అజిత్ పవార్ గైర్హాజరు

ముంబై, నవంబర్ 15: మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాల్సింది పక్కన పెట్టి మహాయుతి కూటమి నేతలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ఒకరి వాదనలను మరొకరు తప్పుబడుతున్నారు.

అయితే మహాయుతి కూటమి నేతల మధ్య విభేదాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఇచ్చిన నినాదమే ప్రధాన కారణమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న యోగి ఎన్నికల ర్యాలీ సంద ర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన గతంలో ఇచ్చిన ‘మనం విడిపోతే అంతమవుతాం’ అని అర్థం వచ్చే నినాదాన్ని పునరుద్ఘాటించారు.

ఈ నినాదం పట్ల బీజేపీ సహా మహాయుతి కూటమి నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. యోగి నినాదం మహారాష్ట్ర రాజకీయాలను ప్రతిబింబించదని అశోక్ చవాన్, పంకజ ముండే వంటి బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. ముఖ్యంగా మహాయుతి కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న అజిత్ పవార్ యూపీ సీఎం వ్యాఖ్యలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

యోగి ఇచ్చిన నినాదాన్ని తాను సమర్థించడం లేదని ప్రకటించారు. దీని గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్టు పేర్కొన్నారు. బహుశా ఆ నినాదం జార్ఖండ్, యూపీ వంటి రాష్ట్రాల్లో పని చేస్తుందేమో కానీ అంబేడ్కర్ సూత్రాలను పాటించే మహారాష్ట్ర నేలపై దీనికి స్థానం లేదన్నారు. అంతేకాకుండా ఆ నినాదాన్ని పక్కకు పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కూటమి నేతలకు సూచించారు. 

ప్రధాని సభకు దూరంగా అజిత్

మహాయుతి కూటమిలోనే ఉన్నప్పటికీ అజిత్ పవార్ గురువారం ప్రధాని మోదీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభకు హాజరు కాలేదు. ముంబైలోని ఛత్రపతి శివాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మహాయుతి కూటమి నేతలు ప్రధానితో కలిసి ప్రజలకు అభివాదం తెలి పారు. తామంతా ఐక్యంగా ఎన్నికల్లో పోరాడుతున్నామనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమి నేతలు ఐక్యంగా కనిపించడం చాలా ముఖ్యం. అందువల్ల ఏ రాజకీయ పార్టీ కూడా ఐక్యతా సందేశాన్ని ఇచ్చే మీటింగ్‌కు డుమ్మా కొట్టదు. కానీ, మహారాష్ట్రలో ఇదే జరిగింది.

అజిత్ పవార్ సహా ఎన్సీపీ నేతలు ప్రధాని సభలో కనిపించలేదు. దీంతో మహాయుతి కుటమిలో విబేధాలు తారాస్థా యికి చేరాయనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. 

వివరణ ఇచ్చిన ఫడ్నవీస్ 

మహాయుతి కూటమిలో విభేదాలు వచ్చాయనే వార్తలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ వాటిని కొట్టిపారేశారు. తమ కూటమి నేతల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సభకు ఎవరెవరు హాజరు కావాలనే అంశంపై ముం దుగానే ప్రణాళిక రూపొందించుకున్నట్టు చెప్పారు.

దాని ప్రకారం నేతలందరూ ప్ర ధాని సభకు హాజరైనట్టు వివరించారు. సీ ఎం యోగి ఇచ్చిన నినాదంతోపాటు ప్రధా ని మోదీ ఇచ్చిన ‘ఏక్ హై తో సేఫ్ హై’ నినాదాన్ని ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చేందుకే రూపొందించినట్టు పేర్కొన్నారు. అజిత్ ప వార్, అశోక్ చవాన్‌లు గతంలో విభిన్న సి ద్ధాంతాలతో పని చేసినట్టు చెప్పారు. అందువల్ల వారు ఆ నినాదాల్లోని అంతరర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారని తెలిపారు.

అన్ని విషయాలు వారికి అర్థమయ్యేలా తాము చెబుతామని వివరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మహా వికాస్ అఘాడీ నేతలు తమ కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమి చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లను కోల్పోయినట్టు చెప్పారు.

అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వారి ప్రచారాలను ధీటుగా తిప్పికొడతామని పేర్కొ న్నారు. కాగా, నవంబర్ 20న జరిగే ఎన్నికల నాటికి ఈ వివాదం ముగుస్తుందో లేక మరింత ముదిరి మహాయుతి కూటమిని దెబ్బ తీస్తుందో వేచి చూడాలి.