calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగి ‘ఒక పెద్ద భోగి’: బెంగాల్ సీఎం మమత

17-04-2025 01:48:55 AM

తిప్పికొట్టిన బీజేపీ

కోల్‌కతా, ఏప్రిల్ 16: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో అల్లర్లు, హింసాకాండ చెలరేగడం పై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పం దించారు. ‘యోగి ఒక పెద్ద భోగి’ అని విమర్శలు గుప్పించారు. ముర్షీదాబాద్‌లో హింసాకాండ అనంతరం ఇమా మ్‌లతో మమత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగి చాలా పెద్ద మాటలు చెబుతున్నారని, ఆయన పెద్ద భోగి అని అన్నారు. మహాకుంభ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా అనుమతించరని విమర్శించారు. అల్లర్లను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నందునే యోగి వ్యా ఖ్యలు ఆమెకు నచ్చడం లేదని యూపీ బీజేపీ ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి అన్నారు.