20-02-2025 02:29:28 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): హైదరాబాద్ భాగ్యనగరం శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ(Bhagyanagar Shivaji Seva Samithi Welfare Society) ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి(Chhatrapati Shivaji Jayanti) సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటుచేసిన జాతీయ సేవ పురస్కార్డుకు కామారెడ్డి జిల్లా యోగా ఎస్ ఎస్ వై అధ్యక్షుడు రాంరెడ్డి ఎంపికయ్యారు. గత 25 సంవత్సరాల నుండి ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ యోగ నిష్ణాతులను తయారు చేస్తూ రాష్ట్రం లోనే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా యోగా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందిన జిల్లా గా గుర్తింపు పొందినందుకు జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. అందుకుగాను వారి సేవలను గుర్తించి భాగ్యనగరం శివాజీ సేవ సమితి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు జ్ఞాపిక తో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్ ఎస్ వై కేంద్ర యోగా సభ్యులు పెట్టిగాడి అంజయ్య, బాస రఘుకుమార్, సిద్ధా గౌడ్ , లద్దూరి లక్ష్మీపతి యాదవ్, వెంకటేశం, మహిళలు హిమా బిందు మంగమ్మ సాయి సుధా మరియు ఇతర సభ్యులు రామ్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.