calender_icon.png 23 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సేవా పురస్కార్ అవార్డు పొందిన యోగా అధ్యక్షులు రామ్ రెడ్డి

22-02-2025 09:37:37 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): భాగ్యనగరం శివాజీ సేవ సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పురస్కార్ అవార్డులకు కామారెడ్డి పతంజలి యోగ జిల్లా అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఎంపికైన్నారు. 25 సంవత్సరాల నుండి ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ అనేక మందిని యోగా సాధకులుగా తయారు చేసినందుకు ఆయన చేసిన  యోగ కృషిని గుర్తించి భాగ్యనగరం శివాజీ సేవా సమితి వారు అవార్డు అందించడం జరిగింది. ఈ మేరకు ఘనంగా సన్మానించి, మెమొంటో బహుకరించారు.  అవార్డు గ్రహీత యోగ రామ్ రెడ్డి గారిని పలకరించగా ఈ అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇదే క్రమంలో మదెంతో బాధ్యతలు పెంచిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కామారెడ్డిలో ప్రముఖులు స్వచ్ఛంద సంస్థ నాయకులు యోగా సభ్యులు రాజకీయ నాయకులు వారందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే జిల్లా యోగా భవనము అందరి సహకారంతో నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు.

ఇక్కడ యోగ శిక్షణ తీసుకున్న విద్యార్థులు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించి అనేక పథకాలు తీసుకురావడం జరిగిందని ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు యోగ పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లాలో మరిన్ని యోగా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని రంగుల ప్రపంచాన్ని చూసి ఇంటర్నేషనల్ మల్టీ లెవెల్ కంపెనీలు తయారు చేస్తున్న కాస్పోర్టికల్ వాడి పుట్టుకతో వచ్చిన అందాన్ని నష్టం చేసుకోవద్దని హితవు పలికారు. జిల్లా కేంద్రం కామారెడ్డి పట్టణంలో ఉన్న 49 వార్డుల్లో 49 యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష శుద్ధితో పనిచేస్తున్నామన్నారు ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి ఎస్ ఎస్ వై కేంద్ర యోగా గురువులుపెట్టిగాడి అంజయ్య బాసర రఘుకుమార్,  సిద్ధా గౌడ్ , యోగ సభ్యులు లక్ష్మీపతి యాదవ్,  వెంకటేశం మహిళలు హిమా బిందు మంగమ్మ సాయి సుధా మరియు ఇతర సభ్యులు రామ్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.