calender_icon.png 12 March, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన వర్సిటీ వీసీగా వైఎల్ శ్రీనివాస్

12-03-2025 01:21:25 AM

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): సమ్మక్క, సారక్క ట్రైబల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొ. లక్ష్మీశ్రీనివాస్ యడవల్లిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీకి మొదటిసారిగా కేంద్ర విద్యాశాఖ వీసీని నియమించింది.

హైదరాబాద్‌లోని ఆరోరా విద్యాసంస్థలో శ్రీనివాస్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పదవిలో ఈయన ఐదేళ్లు లేదా ఆయనకు 70 ఏళ్లు వచ్చేంతవరకు కొనసాగనున్నారు. ఈ వర్సిటీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశముంది.