రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక.. అటు హిందీలోనూ నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ‘ఛావా’ సినిమా ఒకటి. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ కథానాయ కుడిగా నటిస్తున్న ఈ చరిత్రాత్మక చిత్రంలో శంభాజీ భార్య మహారాణి యేసుబాయి భోంసాలే పాత్రను రష్మిక పోషిస్తోంది.
మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ తనయుడు మహారాజా శంభాజీ మహారాజ్ జీవిత విశేషాల ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇంకా అక్షయ్ ఖన్నా, అషుతోష్ రాణా, దివ్యదత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం విక్కీ కౌశల్ పాత్రకు సంబంధించిన పోస్టర్లను వదిలారు. తాజాగా మంగళవారం రష్మిక, అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. రష్మిక పట్టుచీర కట్టులో ఒంటినిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిప డేలా కనిపిస్తోంది. రష్మికకు సంబంధించి రెండు పోస్ట ర్లున్నాయి. ఓ పోస్టర్‌లో ఆమె చిరునవ్వులు చిందిస్తుం డగా.. మరో పోస్టర్‌లో గంభీరంగా కనిపిస్తోంది.
ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా..
‘ఛావా’ చిత్రంలో అక్షయ్ ఖన్నాను ఔరంగ జేబ్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా విడు దల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘డర్ ఔర్ దేహ్‌షత్ కా నయా చెహ్రా’ అన్న వ్యాఖ్యను జోడిం చిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో ‘మొఘల్ సామ్రాజ్య పాలకు డు మొఘల్ షాహెన్‌షా ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా ను పరిచయం చేస్తున్నాం’ అని రాసుకొచ్చింది చిత్ర బృందం. కాగా ఈ సినిమా ట్రైలర్ నేడు (జనవరి 22న) రిలీజ్ కానుంది.