తీహార్ జైలు తెలుగు రాజకీయ నేతలకు మరోసారి ఆతి థ్యం ఇవ్వనున్నదని చర్చ ప్రారం భం అయ్యింది. లిక్కర్ కేసులో మొన్నటిదాకా అదే జైలులో ఎమ్మెల్సీ కవిత ఉండగా, తాజాగా బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వంతు వచ్చిందని సామాజిక మాధ్యమా ల్లో నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ విచారణ ఫార్మూలా కార్లకంటే స్పీడ్‌తో జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదవ్వగా, తాజాగా ఈడీ కలుగజేసుకోవడంతో కేటీఆర్‌కూ జైలు యోగం తప్పదా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనంటూ జనంమాట్లాడుకుంటుండటం గమనార్హం.
డీ నాగరాజు