05-03-2025 01:31:35 AM
రూ.30వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్ సర్కారు పన్నాగం
ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు మండిపాటు
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టారని మంగళవారం ఒక ప్రకటనలో మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరివేసుకునే పరిస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు. “ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుంది” అని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మొసలికన్నీరు కార్చారని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల సమయం లో వాగ్దానాలు చేసి ఇప్పుడేమో వేలకోట్ల విలువైన భూ ములను వేలం వేసేందుకు తెరలేపారని పేర్కొ న్నారు. మాస్టర్‌ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియమ కానికి గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని, కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10వేల కోట్లు ఇప్పటికే సమీకరించిందన్నారు.
ఇప్పుడు ఇదే భూమి ని వేలం వేసి దాదాపు రూ.30వేలకోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. తలాతోకలేని విధానాలు, నిర్ణయాల వల్ల రాష్ర్ట రాబడి తగ్గడం వల్ల చివ రకు ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆదా యం సమకూర్చుకునే స్థాయికి దిగజారారన్నారు. భూములు అమ్మబోమని ప్రజల ను, అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమా పణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.