మేడ్చల్‌లో నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు
గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
మేడ్చల్, అక్టోబర్ 5: ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభించిన మరుసటి రోజే మొరాయించింది. నిజామాబాద్‌లో శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. నిజామాబాద్ నుం చి హైదరాబాద్‌కు శనివారం బస్సు బయలుదేరింది. మేడ్చల్‌లో ఒక ప్ర యాణికుడు దిగడానికి డ్రైవర్ బస్సు ఆపి డోర్ తెరిచాడు.
ఆ తర్వాత మళ్లీ డోర్ వేయడానికి ప్రయత్నించగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఎలక్ట్రిక్ బస్సులు డోర్ క్లోజ్ అయితేనే ముం దుకు కదులుతాయి. దీంతో బస్సు కదలలేదు. ఈ కారణంగా గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అసలే మేడ్చల్‌లో ఫ్లుఓవర్ పనులు నడవడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. దీనికి తోడు బస్సు నిలిచిపోవడంతో మూడు కిలోమీటర్లు రేకుల బావి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు వేరే బస్సులలో వెళ్లిపోయారు.