calender_icon.png 10 February, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొన్న కొంపల్లిలో.. నేడు ఆదిబట్లలో

10-02-2025 01:24:08 AM

  1. వరుసగా రియల్టర్ల ఆత్మహత్యలు
  2. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే: హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి, నేడు ఆదిభట్లలో నరసిం హగౌడ్ ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరమని మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రియల్టర్ల ఆ త్మహత్యలకు సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అని ఆరోపించారు.

హైదరాబాద్ బాగుంటేనే, తెలంగాణ బాగు టుందని, అభివృద్ధి సాధ్యం అవుతుందన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. రైతన్నలు, నేతన్న లు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారిందని, ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుందని ఆయన విమర్శించారు. గతమెంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి తయారైందన్నారు.