- పథకాల అమలులో కాంగ్రెస్ సర్కార్ నయవంచన
- మండలానికి ఒక గ్రామమేనని మ్యానిఫెస్టోలో పెట్టారా?
- ఎక్స్‌లో డిఫ్యూటీ సీఎం భట్టిని ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): మండలానికి ఒక గ్రా మంలోనే పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టా రా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను ప్ర శ్నించారు. “మండలానికి ఒక గ్రా మంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇ చ్చారా..
మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా.. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా.. మం డలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా.. నాడు అందరికీ అన్నీ అని.. నేడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కారు నయవంచన క్షమించరు.. ” అని అందులో మండిపడ్డారు.
ఎన్నికలప్పుడు ప్రతి ఇంటా అబద్ధపు హామీ లను ఊదరగొట్టి ఏడాది తర్వాత వన్ విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. ప్రతిప క్షంగా ఇంకో నాలుగేళ్లు ఓపిక పట్టడానికి తాము సిద్ధమని కానీ ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తర్వాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరని చెప్పారు. పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమేనని కేటీఆర్ హెచ్చరించారు.