- 2024-25 బడ్జెట్లో రుణాల అంచనా రూ. 49255.41 కోట్లు
- జనవరి నాటికి రూ. 53,978.93 కోట్లకు చేరిక
- ఇందులో 74 శాతం బీఆర్ఎస్ సర్కారు బకాయిలు.. వడ్డీలకే
- అప్పులు తీర్చేందుకు తిరిగి రుణాలు
హైదరాబాద్, జనవరి 28(విజయక్రాంతి): బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులు.. కాంగ్రెస్కు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా.. నాటి రుణాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు అప్పులు మోయలేని భారంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను రుణాలు దాటిపోయాయి.
2024-25లో ప్రభుత్వం రూ.49,255.41 కోట్ల అప్పులను తీసుకోవాలని అంచనా వేసింది. కానీ మరో రెండు నెలలు మిగిలి ఉండగానే.. జనవరిలోనే అప్పులు, బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. ప్రభు త్వం మంగళవారం ఆర్బీఐ నుంచి తీసుకున్న రూ.2800కోట్లతో రుణాలు రూ.53,978.93 కోట్లకు చేరుకోవ డం సర్కారును కలవరానికి గురిచేస్తోంది.
వాస్తవానికి నవంబర్ నెలలో రూ.2,729.17 కోట్లను అప్పుగా తీసుకున్న ప్రభుత్వం.. డిసెంబర్ నెలలో ఏకంగా రూ.10,328.85 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఫలితంగా రుణం రూ.53,978.93 కోట్లకు చేరుకుంది.
సంక్షేమం, అభివృద్ధికి భారీగా ఖర్చు..
ప్రభుత్వానికి రాబడి తెచ్చే శాఖల నుంచి ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదు. ఖజానా కు గుండెకాయ అయిన జీఎస్టీ శాఖ ఆదా యం డిసెంబర్ నాటికి 62శాతం మాత్రమే వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం దారుణంగా 41శాతం మాత్రమే రావడం గమనార్హం. ఒకవైపు ఆదాయం తగ్గడం..
మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయాల్సి రావడం, మరోవైపు అప్పులు, వడ్డీలు కట్టాల్సిన రావడంతో ప్రభుత్వం డిసెంబర్ రూ.10వేల కోట్లు అప్పుగా తీసుకుంది. దీనికితోడు ఇటీవల ప్రారంభించిన రైతు భరోసాకు భారీగా నిధులు అవసరం కా వడంతో జనవరిలో మరో రూ.5వేల కోట్లను ఆర్బీఐ వద్ద అప్పుగా తీసుకుంది. ఫలితంగా అప్పులు అంచనాలను దాటిపోయాయి.
అప్పులు తీర్చేందుకు అప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి తెలంగాణ అప్పులు రూ.6.71లక్షల కోట్లుగా ఉ న్నాయి. అందుకే కొత్త రుణాలు తీసుకోకుం డా, ఉన్న వాటిని తగ్గించుకోవాలని ప్రభు త్వం సంకల్పించింది. అప్పులు కుప్పగా మారిన రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అప్పులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని నిర్ణయించిం ది.
అనుకున్న విధంగా మొదట్లో రుణాల తీసుకోవడాన్ని భారీగా తగ్గించింది. కానీ గత సర్కారు చేసిన అప్పులకు వడ్డీలు భారీగా మొత్తంలో చెల్లించాల్సి రావడం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోడవంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వానికి అప్పులు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.
ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అ ప్పులను తీర్చడానికే తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడిం ది. నవంబర్ నెలలో ప్రభుత్వం రూ.2,729. 17 కోట్లను అప్పు కింద తీసుకుంది. ఇదే నెలలో వడ్డీగా రూ.1928.14 కోట్లు కట్టింది. అంటే.. తీసుకున్న అప్పు మొత్తం వడ్డీలకే కట్టిందన్నమాట.
రూ.40 వేలకోట్లు బీఆర్ఎస్ పాలు..
జనవరి నాటికి ప్రభుత్వం రూ. 53,978.93కోట్లను రుణంగా తీసుకుంది. ఇందులో 74శాతం గత సర్కారు బకాయి లు, వడ్డీలు, ప్రిన్సిపల్ అమౌంట్ కింద కట్ట డం గమనార్హం. డిసెంబర్ నాటికి ప్రభుత్వం రూ.19556.61కోట్లను వడ్డీ కింద చెల్లించింది. జనవరిలో మరో 2వేల కోట్లను వడ్డీ ల కింద కడుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ కింద మరో రూ.11వేల కోట్లను కట్టింది.
దీని కి అదనంగా బీఆర్ఎస్ దాదాపు రూ.40 వేల కోట్ల బకాయిలను మిగిల్చిపోయింది. అవి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. వీటిలో ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తోంది. ఇం దులో చేనేతకు చెందిన రూ. రూ.490 కో ట్లు, ఇండస్ట్రీకి చెందిన రూ.1000 కోట్లు బకాయిలను చెల్లించింది.
ఇలా బకాయిలు, వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్ కింద మొత్తం దా దాపు రూ.40 వేల కోట్లను సర్కారు చెల్లించగా.. ఇది జనవరి నాటికి ప్రభుత్వం తీసు కున్న అప్పులో 74శాతం కావడం గమనా ర్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కాళేశ్వరం అప్పు రూ.74,590 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద రుణం ఇదే. ఈ ప్రాజెక్టు కింద తీసుకున్న రుణానికి స ర్కారు ఏడాదికి రూ.15వేల కోట్లు వడ్డీ కిం ద చెల్లిస్తోంది. అంటే నెలకు వెయ్యికోట్లకు పై గా ఒక్క కాళేశ్వరానికే ప్రభుత్వం చెల్లిస్తోంది.