ట్రంప్‌తో కలిసి బర్గర్ తిన్న కెన్నడీ జూనియర్
గతంలో ట్రంప్ ఆహారంపై విమర్శలు చేసిన కెన్నడీ
వాషింగ్టన్, నవంబర్ 18: తాను అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాబర్ట్ ఎఫ్ కెన్నడీకి ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తాజాగా వీరిద్దరూ కలిసి మెక్‌డొనాల్డ్ అవుట్ లెట్లో బర్గర్ తింటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ చిత్రాన్ని ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. చిత్రంలో ట్రంప్, కెన్నడీ జూనియర్‌తో పాటు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉండడం విశేషం.
ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్ నాడు విషమని ప్రకటించిన కెన్నడీ జూనియర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు విషమైనది, ఇప్పుడు కాకుండా పోతుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కెన్నడీ జూనియర్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్ విషమని కెన్నడీ జూనియర్ పోల్చారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసే ఆయన బర్గర్ తినడం గమనార్హం. కెన్నడీ జూనియర్‌కు అమెరికాలో ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా, న్యాయవాదిగా పేరున్నది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ ఈ కెన్నడీ జూనియర్‌కు సమీప బంధువు.