ప్రేమ వయసుతో పాటు ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోదు. అందుకే ప్రేమ గుడ్డిదంటారు. ఈ విషయాన్నే నటి శివంగి వర్మ కూడా చెబుతోంది. సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడమే కాకుండా దానికో క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు.. ౩1 ఏళ్ల నటి ౭1 ఏళ్ల నటుడితో ప్రేమలో పడిందంటూ ప్రచారం ప్రారంభించారు. దీనిపై తాజాగా గోవింద్ స్పందించారు.
తామిద్దరం ప్రేమించుకుంటున్న మాట వాస్తవమేనని.. అయితే అది రియల్ లైఫ్‌లో కాదని.. రీల్ లైఫ్‌లో అని పేర్కొన్నారు. “మేమిద్దరం ‘గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే’ సినిమా చేస్తున్నాం. ఇండోర్‌లో షూటింగ్ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్ లేడీతో ప్రేమలో పడతాడు. అదే సినిమా కథ. నా వ్యక్తిగత జీవితంలో మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జరగదు. నా భార్యంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఆమె కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా” అని పేర్కొన్నారు.