‘నిజమే, నేను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నా..’ అని చెప్తోంది దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు ఖుషీ చెప్పిన వాస్తవమేంటి? ఆమెపై ఈ ప్రశంసలేంటి? అనుకుంటున్నారా?! బాల్యంలో ఖుషీ తన అమ్మ శ్రీదేవితో ఓ సినిమా వేడుకు హాజరైంది. కట్ చేస్తే.. ఇటీవల తాను నటించిన ‘ది ఆర్చీస్’ మూవీ ప్రీమియర్ ఈవెంట్లో పాల్గొంది. ఈ రెండు వీడియోలను పక్కపక్కనేసి చూసిన నెటిజన్లు ఖుషీ ముఖం లో ఏదో మార్పు గ్రహించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు.. ఇదంతా గమనించిన ఖుషీ స్పందించి, అసలు విషయం చెప్పేసింది.
కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నందున తన ముక్కు ఆకారం మారిందని తెలిపింది. ఇదే నెటిజన్ల ప్రశంసలకు కారణమైంది. ‘చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుంటారు.. అయితే, బయటకు మాత్రం చెప్పరు.. ఒప్పుకోవడానికి కూడా అస్సలు ఇష్టపడరు. కానీ, ఖుషీ ధైర్యంగా చెప్పింది.. ఆమె నిజాయితీని మెచ్చుకోవాలి’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే.. ఖుషి కపూర్ ప్రస్తుతం తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో బిజీగా ఉందని, ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్నాడని సమాచారం.