బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ వంటి అంతర్జాతీయ బ్యాంక్‌ల్లో దీర్ఘకాలం పనిచేసిన రాణా కపూర్, ఆయన బం ధువు అశోక్ కపూర్, మరికొందరు బ్యాంకర్లు కలిసి నెదర్లాండ్స్‌కు చెందిన రాబో బ్యాం క్ భాగస్వామ్యంతో ముంబై కేం ద్రంగా నెలకొల్పిన యస్ బ్యాంక్‌కు 2004 ఏప్రిల్‌లో రిజర్వ్‌బ్యాంక్ లైసెన్సు మంజూరు చేసింది.
తొలి శాఖను అదే ఏడాది ఆగస్టులో ప్రారంభించింది. యస్ బ్యాంక్ 2005 జూన్‌లో తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసి, స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యింది. యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు అశోక్ కపూర్ 26/11 టెర్రరిస్టుల దాడిలో ట్రైడెంట్ హోటల్‌లో హతమయ్యా రు.
2016 వరకూ సజావుగా నడి చిన యస్ బ్యాంక్ అటుతర్వాత రుణ ఎగవేతలు, ప్ర మోటర్ల అవకతవకలతో క్రమే పీ సంక్షోభంలోకి జారుకుంది. 2020 మా ర్చిలో రాణా కపూర్‌ను 100 మిలియన్ డాలర్ల ఫ్రాడ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది.
1,200 శాఖలు.. రూ.4.05 లక్షల కోట్ల ఆస్తులు
యస్ బ్యాంక్‌కు 2024 సెప్టెంబర్‌నాటికి దేశవ్యాప్తంగా 1,200పైగా శాఖలు ఉన్నా యి. 1,300 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 మార్చి 31నాటికి ఈ బ్యాంక్‌లో 28,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యస్ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.4,05, 493 కోట్లు. ఆస్తుల రీత్యా ప్రైవేటు బ్యాంక్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల తర్వాత ఆరవ స్థానంలో ఉన్నది.
ఈ బ్యాంక్‌లో 2024 సెప్టెంబర్‌నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 23.99 శాతం వాటా ఉండగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద 3.96 శాతం వాటా ఉన్నది. ఇతర ప్రైవేటు బ్యాంక్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సి స్ బ్యాంక్‌లకు 7 శాతం వరకూ వాటా ఉన్నది. ఇండస్‌ఇండ్ బ్యాం క్‌కు ప్రస్తుతం ప్రశాంత్ కుమార్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
రూ.62,576 కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే యస్ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.62,576 కోట్లు. ప్రైవేటు బ్యాంక్‌ల్లో ఆస్తు ల్లో ఆరవస్థానంలో ఉన్న యస్ బ్యాంక్ మార్కెట్ విలువలో మాత్రం ఏడవ స్థానం లో నిలిచింది. ఈ షేరు గత మూడేండ్లలో 42 శాతం రాబడిని ఇచ్చింది.
ఆర్బీఐ టేకోవర్
అవసరమైన మూలధనాన్ని సమీకరించలేక యస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో బెయిల్ అవుట్ ప్రొవిజన్ల మేరకు 2020 మార్చిలో రిజర్వ్‌బ్యాంక్ టేకోవర్ చేసింది. యస్ బ్యాంక్ బోర్డును పునర్‌వ్యవస్థీకరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ కుమార్‌ను యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతాను యస్ బ్యాంక్ నాన్‌ూ చైర్మన్‌గా నియమించింది. పునర్‌వ్యవస్థీకరణ స్కీమ్ ద్వారా యస్ బ్యాంక్‌ను సంరక్షించేందుకు ఆర్బీఐ ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇతర ఆర్థిక సంస్థలు మూలధన పెట్టుబడులు చేశాయి.