హైదరాబాద్: పశ్చిమ మధ్య పరిసర వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని తెలియజేసింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 9 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు, రేపు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసిన వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.