calender_icon.png 14 January, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ కేంద్రంలోనే పసుపు బోర్డు...

13-01-2025 11:09:19 PM

జిల్లా ప్రజలకు సంక్రాంతి కానుక...

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్(Narendra Modi) గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జిల్లా పసుపు బోర్డు ఏర్పాటుకు అరవింద్(MP Dharmapuri Arvind) విజ్ఞాపనను ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 అక్టోబర్ 1న మహబూబ్నగర్ లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం విధితమే ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పసుపు పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. గతంలో ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకై ఎంపీ ధర్మపురి అరవింద్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. అప్పటినుండి కేంద్రం వద్ద ఆయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ పసుపు బోర్డు పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

జిల్లా రైతులలో కేంద్ర ప్రకటన మరింత ఉత్సాహాన్ని నింపింది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పసుపు బోర్డు మహారాష్ట్ర సాంగ్లీకి తరలిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా పసుపు బోర్డు ప్రయత్నాలు నిలిచిపోయాయి. కేంద్ర మంత్రులతో పాటు వ్యవసాయ మంత్రులతో అనేకమార్లు పసుపు బోర్డు విషయమై ప్రస్తావించి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రాధాన్యతను పసుపు నాణ్యతను అంతర్జాతీయ మార్కెట్లో గల డిమాండ్ ను బిజెపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పసుపు బోర్డు విషయం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతిపక్షాలకు బ్రహ్మోత్సవంగా మారడం తదితర అంశాలను ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు కేంద్రం స్పందించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు జిల్లా కె జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మరోవైపు పసుపు బోర్డు హామీతో ఎన్నికల్లో నెగ్గిన ధర్మపురి అరవింద్ కు పసుపు బోర్డు హామీ ఆయన రాజకీయ భవిష్యత్తు ముడిపడిన అంశం మారింది. సంక్రాంతి కానుకగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. తదుపరి బోర్డు పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.