calender_icon.png 15 January, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి మోదీ కానుకగా పసుపు బోర్డు

14-01-2025 02:16:55 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం తెలంగాణకు ప్రధాని మోదీ అందించిన సంక్రాంతి కానుక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభా ష్ తెలిపారు. దేశంలో 70శాతం పసుపు నిజామాబాద్‌లోనే పండుతుందన్నారు. అందుకే ఈ ప్రాంతానికి పసుపు బోర్డును ఇవ్వడం ద్వారా తెలంగాణపై మోదీ ప్రత్యేకమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారన్నారు.

ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పసుపు ఉత్పత్తి, వినియోగంతో పాటు ఎగుమతుల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన ఉందని.. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో భారత్ 75శాతానికి పైగా వాటాతో అత్యుత్తమ స్థానంలో నిలిచిందన్నారు. 2022 దేశంలో 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేశార ని..11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు.

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా పసుపు దిగుబడి ఉంటుందన్నారు. 2022 ప్రపంచ వాణిజ్యంలో 62 శాతం వాటాతో 1.534 లక్షల టన్నుల పసుపును, 207.45 మిలియన్ డాలర్ల విలువైన పసుపు సంబంధ ఉత్పత్తులను విదేశాలకు మన దేశం ఎగుమతి చేసి రికార్డు సాధించినట్లు వెల్లడించారు. 2030 నాటికి 1 బిలియన్ డాలర్లకు ఈ ఎగుమతుల పెంపు లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు నిర్దేశించుకుందన్నారు.