calender_icon.png 30 October, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

15-07-2024 01:59:05 AM

ఆవరన్తం ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాం ధ్రప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాఖాలో ఏర్పడిన ఆవర్తనం, పశ్చిమ బెం గాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసి పోయిందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సోమవారం ఉదయం నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించిం ది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా బాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములు గు, నల్లగొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. మంగళ, బుధ వారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా ల్లో భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.