21-03-2025 07:03:41 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయితీ నర్సరీని శుక్రవారం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి మన్నె ప్రభాకర్ తనిఖీ చేశారు. రానున్న వేసవికాలంలో ఎండల తీవ్రతకు నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మొక్కలపై నేరుగా ఎండ పడకుండా రక్షణ కవచం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు మూడు పూటల మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాలని, నర్సరీని ఎప్పుడూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచాలని గ్రామ సిబ్భందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రకాష్,గ్రామ పంచాయితీ కార్యదర్శి, సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.