calender_icon.png 27 September, 2024 | 8:53 PM

రాష్ట్రంలోనే ఆదర్శంగా అభివృద్ధి చెందాలి

27-09-2024 06:45:25 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చెందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.  శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరయ్యారు. పాలకవర్గం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని రైతుల అభివృద్ధికి మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఎల్లారెడ్డి తో పాటు సదాశివనగర్ గాంధారిలో కూడా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ లను నియమించడం జరిగిందని తెలిపారు. సామాన్య కార్యకర్త ల లు పరమేష్ సంగు యా నాయక్ లకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను అప్పగించినట్లు తెలిపారు. ఎంతోమంది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ప్రయత్నించిన దేనికి లొంగకుండా తన కోసం పార్టీ కోసం కృషిచేసిన కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా పదవి ఇస్తానని ఎవరు అధైర్యపడవద్దని అన్నారు.

రానున్న రోజుల్లో ఇందిరమ్మ కమిటీలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా పదవి వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఎటువంటి పైరవీలు తన వద్ద పని చేయమని కష్టపడ్డ వారికే పదవి వస్తుంది అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలామంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వరి మొక్కజొన్న పత్తి పంటలతో పాటు అధిక దిగుబడి అధిక లాభాలు ఇచ్చే కొత్త రకమైన వంగడాలను పంటలను వేయాలని యువ రైతులకు ఎల్లప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. కొత్త రకమైన పంటలు సరికొత్త విధానాలతో పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు అని అన్నారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మనకు దగ్గరలో ఉన్నందున రైతులు తమ బిడ్డలను పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించి అగ్రికల్చర్ విద్యను అభ్యసించి సరికొత్త విధానాలను రూపొందించే విధంగా తయారు చేయాలన్నారు.

తాను కూడా అగ్రికల్చర్ కాలేజీలో చదువుకున్నానని తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అని అన్నారు. నియోజకవర్గంలో నకిలీ విత్తనాలకు తావు లేకుండా వరి కొనుగోలు విషయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో వారి కొనుగోలు చేయాలని అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించమని చెప్పాను అని అన్నారు. రైతులు రుణమాఫీ విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 29739 మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. నియోజకవర్గ రైతులకు రెండు పంటలు పండే విధంగా కాలేశ్వరం ప్యాకేజీ 22 పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో నాలుగు గంటలు రివ్యూ సమావేశం అధికారులతో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. మోతే కాటేవాడి గుజ్జు ప్రాజెక్టులు పూర్తిచేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కరువు అనేది లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్లు తెలిపారు.

వీటితోపాటు పోచారం ప్రాజెక్టుకు పూడికతీత పనులు పై సర్వే నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. పోచారం కెనాల్కు రిపేర్ వస్తే ఆ పనులు కూడా పూర్తి చేయించాను అని తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో ట్యాంక్ బండ్ పార్కు ఆడుకో అమృత్ 2.0 ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దసరా రోజు ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లింగంపేట మండలంలో 400 సంవత్సరం ల క్రితం నాటి నాగన్న బావి మెట్ల బావిని 10 లక్షల నియోజకవర్గ నిధులతో పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న మెట్ల బవులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. గాంధారి మండల కేంద్రంలో ఐదు ఎకరాలలో మినీ స్టేడియం నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో వచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఆరోగ్య ఎల్లారెడ్డిగా తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తానన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదని మదన్మోహన్రావును ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆయన నియోజకవర్గం ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దరున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కేకే వై రోడ్డును త్వరలో ప్రారంభించేలా రోడ్లు భవనాల శాఖ మంత్రితో ఎమ్మెల్యే మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య, నాగిరెడ్డిపేట్ లింగంపేట్ ఎల్లారెడ్డి సదాశివ నగర్ గాంధారి మండలాల కాంగ్రెస్ నాయకులు లింగ గౌడ్ నారా గౌడ్ పరమేష్ సంధ్యా నాయక్ సాయిబాబా మున్సిపల్ చైర్ మెన్ సత్యం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ పాల్గొన్నారు.