01-03-2025 01:27:18 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): విశ్వ వ్యాఖ్యత ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ(Arts and Culture Academy), కె.ఎన్.డి. సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జాతీయస్థాయి గౌతమి స్వర్ణ నంది అవార్డు(National level Gowthami Swarna Nandi Award)కు ఇల్లెందు పట్టణ వాసులు ఎంపికయ్యారు. శివశక్తి దండు సారయ్య, న్యాయవాది కీర్తి కార్తిక్, డాన్స్ మాస్టర్ వెంకటేష్ ఎంపికైనట్టు వారు తెలిపారు. కరోనా సమయంలో పేదవారికి, కళాకారులకి, క్రీడాకారులకి, ఆర్థిక సహయ సహకారాలతో పాటు ఎంతోమందికి సేవ చేసినందుకు ఉత్తమ సామాజిక సేవ జాతీయ స్థాయి గౌతమి స్వర్ణ నంది అవార్డును శివశక్తి దండు సారయ్య కి ప్రకటించడం జరిగింది.
అలాగే ఉత్తమ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నటువంటి ఇల్లందు కోర్టు న్యాయవాది కీర్తి కార్తిక్ ని ప్రకటించారు. అలాగే సింగపూర్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇల్లందు సీనియర్ డాన్స్ మాస్టర్ కడారి వెంకటేష్ ని కూడా ఎంపిక చేశారు. ఉగాది పురస్కారాలు సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానంచినట్లు వారు తెలిపారు. మార్చి 16 వ తేదీన హైదరాబాద్ వేదికగా త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ చిక్కడపల్లి లో ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు తెలియజేశారని వారు వివరించారు. తమకు ఈ అవార్డు ప్రకటించడం వల్ల చాలా సంతోషంగా ఉందని శివశక్తి దండు సారయ్య, న్యాయవాది కీర్తి కార్తిక్, సీనియర్ డాన్స్ మాస్టర్ కడారి వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు.