calender_icon.png 15 March, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోలీ సంబరాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

14-03-2025 08:48:26 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో హోలీ పండుగ సందర్బంగా శుక్రవారం తన నివాసంలో రంగులతో హోలీ సంబరాలలొ పాల్గొన్ని నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి కోన లక్ష్మీతోపాటు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోయగూడెం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలను స్కూటీపై తిరుగుతూ సిసి రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు.

జిల్లా ఎస్పీతో హోలీ సంబరాలు జరుపుకున్న ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు


ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి శుక్రవారం హోలీ పండుగను జరుపుకున్నారు. ఇల్లందు డిఎస్పి చంద్రబాను, ఇల్లందు, టేకులపల్లి సిఐలు బత్తుల సత్యనారాయణ, తాటిపాముల సురేష్, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.