ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) శనివారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనది ఇల్లందు మండలం హన్మంతులపాడు గ్రామం. ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామానికి భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఆయన రెండు సార్లు బూర్గంపాడు నియోజకవర్గం (1983,94) సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి ఇల్లందు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ లభించికపోవడంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా టికెట్ దక్కకపోడవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అబ్బయ్య మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.