16-04-2025 12:00:00 AM
చేవెళ్ల , ఏప్రిల్ 15 : శంకర్పల్లి మండల పరిధి కొత్తపల్లి గ్రామంలో ఊరు చివర నూతనంగా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు. మంగళవారం ఆలయంలో ఎల్లమ్మత ల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వేదపండితుల నడుమ అంగరంగా వైభవంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో బీర్ల కళాకారులతో భక్తులకు ఎల్లమ్మ కథను వినిపించారు. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని పూజలు చేశారు.