06-04-2025 08:22:40 PM
విజేతలకు బహుమతులు ప్రధానం..
మందమర్రి (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు రామకృష్ణాపూర్ లో సార్ల ఎల్లయ్య స్మారక క్రికెట్ పోటీలు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ (వి) మైదానంలో ఆదివారం ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణానికి చెందిన కపిల్ జట్టు, ప్రశాంత్ జట్టు, శేఖర్, వినోద్, హర్ష జట్టులు పాల్గొన్నాయి. ఐపిఎల్ తరహాలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీల్లో ప్రశాంత్ జట్టు శేఖర్ జట్టుపై ఘన విజయం సాధించింది.
విజేతగా నిలిచిన ప్రశాంత్ జట్టు సభ్యులకు 4 వేల రూపాయలు నగదుతో పాటు మెమొంటో అందించారు. రన్నర్ గా నిలిచిన శేఖర్ జట్టు సభ్యులకు 2 వేలు నగదు మెమోంటో అందజేశారు. మిగతా జట్టు కెప్టెన్ లకు మెమోంటోలు అందజేశారు. విజేతలకు బహుమతులను ఏకలవ్య ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శిలోకి, నిర్వాహకులు సార్ల మల్లమ్మ, సమ్మక్క, రాజమల్లు, సమ్మయ్యలు పాల్గొన్నారు.