calender_icon.png 25 November, 2024 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ నేతలను గుర్తించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

25-11-2024 01:51:43 AM

పీసీసీ అధ్యక్షుడికి నేతల ఫిర్యాదు 

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లా రెడ్డి నియోజకవర్గంలో తన వ్యక్తిగత సిబ్బందితో ఎమ్మెల్యే నాయకులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. నియంతలా వ్యవహరిస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకుండా విదేశాలకు వెళ్తూ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వ్యక్తిగత సిబ్బందితో పంచుతూ సీనియర్ నాయకులను అవమానపరుస్తున్నారని ఫిర్యాదు చేశారు.

గత 20 ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న వారిని కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగి తే గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారి లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరెడ్డి మహేందర్‌రెడ్డి, నల్లమడుగు షరీఫ్, కాట్‌మండి సంతోష్ ఉన్నారు.