calender_icon.png 14 March, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ

13-03-2025 09:25:49 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రెండేళ్ల 9 నెలల కాలం పాటు ఎల్లారెడ్డిలో డిఎస్పీగా శ్రీనివాసులు పనిచేశారు. విధుల నిర్వహణలో అందరికీ కలుపుగోలుగా ఉంటూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక కృషి చేశారు. తనకంటూ ఓ మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన లు డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని ప్రభుత్వం నియమించలేదు.