06-04-2025 12:00:00 AM
ఈ రోజుల్లో 40 దాటుతున్నాయంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి. 60 ఏళ్లంటే అత్యంత ప్రమాదకరమైన వయస్సుగానే పరిగణించాలి. ఈ వయసులో వ్యక్తులంతా సీనియర్ సిటిజన్స్ కేటగిరీలోకి వచ్చేస్తారు. అంతకు ముందులా యాక్టివ్‌నెస్ ఉండదు. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జ్ఞాపకశక్తి మందగించడంతో పాటు కండరాల బలహీనత, దంత సమస్యలు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు చుట్టుముడతాయి.
ఇక బీపీ, షుగర్ వంటివి అయితే ఈ సమయం వరకూ కూడా ఆగవు. 40 దాటిందంటేనే మొదలై పోతాయి. ఇక 60లో ఇవి మరింత తీవ్రమవుతాయి. వీటన్నింటినీ అదుపులో ఉంచుకుని 60లోనూ 20లా జీవించాలంటే మన జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. అవేంటో తెలుసుకుందాం.
సమతుల్య భోజనం అనేది ఏ వయసు వారికైనా చాలా మంచిది. 60లో మరీ మంచిది. వయసులో శరీరం బలహీనంగానూ.. మరింత ఇబ్బందికరంగానూ తయారవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకునేందుకు మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
స్నేహితులతో కనెక్ట్ అవ్వండి
ఒక మంచి స్నేహితుడు వంద పుస్తకాలతో సమానం అంటారు. కాబట్టి 60 దాటిన వారు ఒంటరిగా ఇంటి పట్టునే కూర్చోకుండా స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో కాలక్షేపంచేస్తూ ఉండండి. అది మిమ్మల్ని యాక్టివ్ చేయడమే కాకుండా.. మెదడును యాక్టివ్ చేసి జ్ఞాపకశక్తిని సైతం పెంపొందిస్తుంది.
శారీరక వ్యాయామం..
వయసుకు తగినట్టుగా కొన్ని వ్యాయామాలు చేస్తే 60లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. కండరాలు, కీళ్లు, ఎముకలను వ్యాయామం బలోపేతం చేస్తుంది. అలాగే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. నిత్యం పూర్తి బాడీ చెకప్ చేయించుకుని అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.
ధ్యానం, పుస్తక పఠనం
ఒంటరిగా కూర్చోకుండా పిల్లలు అందుబాటులో ఉంటే వారితో చక్కగా ఆటలాడుతుంటే మంచిది. అలాగే రోజూ కాసేపు ధ్యానం చేయాలి. పుస్తకాలు, పేపర్ చదవడం వంటివి చేస్తుండాలి. అలాగే 60 ఏళ్ల వయసులో నిద్రకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీలైనంత మేరకు ప్రకృతిలో సమయం గడపండి. పైన తెలిపినవన్నీ చేస్తూ ఉంటే 60లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మంచి యాక్టివ్‌గా ఉంటారు.