calender_icon.png 3 March, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

71 ఏళ్లనాటి నిరుపేదలు

02-03-2025 12:40:32 AM

అక్కినేని నాగేశ్వరరావు, జము న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిరుపేదలు’. టీ ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2 మార్చి 1954లో విడుదలైంది. అంటే ఈ విడుదలై సరిగ్గా ఈ రోజుకి ౭౧ ఏళ్లు అయిందన్న మాట! గోకుల్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దోనేపూడి కృష్ణమూర్తి నిర్మించారు.

నారాయణరావు అనే యువకుడు జీవనోపాధి కోసం నగరానికి చేరుకోవడంతో కథ ఆరంభమవుతుంది. నారాయణరావు పని ఎక్కడా దొరక్క ఆకలితో స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన రంగన్న అనే రిక్షావాలా అతనికి ఆశ్రయం ఇస్తాడు. రంగన్నకు కమల, రాము అనే ఇద్దరు పిల్లలు. కమలతో నారాయణ ప్రేమలో పడతాడు.

అతనికి రంగన్న అద్దెకు ఓ రిక్షా ఇప్పిస్తాడు. ఎలాగైనా రిక్షాను సొంతంగా కొనుక్కోవాలన్న కోరికతో రేయింబవళ్లు శ్రమించి కూడబెట్టిన డబ్బును యజమాని ధర్మయ్య వద్ద దాస్తాడు. రిక్షా కొనుక్కునేందుకు అవసరమైన డబ్బు సమకూరిందని నిర్ణయించుకున్న తర్వాత ధర్మయ్య వద్దకెళ్లి నారాయణ డబ్బు అడుగుతాడు.

కానీ ధర్మయ్య అతడిని మోసం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపు తీసుకుంది? కమల, నారాయణ జీవితాలు ఏమయ్యాయి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.