సంగారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): మైనర్‌కు మాయామాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్, పోక్సో జడ్జి కే జయంతి తీర్పునిచ్చినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు.
న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ పీఎస్ పరిధిలో ఉన్న అమీరాబాద్‌కు చెందిన వసంత్‌రావు అలియాస్ పింటు (30) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారన్నారు. 2018లో హద్నూర్ పీఎస్‌లో కేసునమోదు కాగా అప్పుటి ఎస్‌హెచ్‌వో ఈశ్వర్ దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారన్నారు.
కేసు పూర్వపరాలు విన్న జిల్లా సెషన్స్, పోక్సో జడ్జి కే జయంతి నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు. పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని పరిధిలో నమోదైన మరో కేసులో మైనర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ముత్తంగికి చెందిన మహేంద్ర జగదీశ్(20)కు 3ఏండ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారన్నారు.