ఖమ్మం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షపడింది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొత్త లింగాల గ్రామానికి చెందిన పండగ నాగేంద్రబాబు, పండగ రాంబాబు 2019లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారిపై కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసును విచారించిన న్యాయాధికారి పండగ నాగేంద్రబాబు(ఏ1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధించారు. రాంబాబు(ఏ2)కు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.