calender_icon.png 29 September, 2024 | 4:56 PM

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే లక్ష్యం

29-09-2024 02:41:03 PM

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే లక్ష్యంతో డైరీ ని స్థాపించాం

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 2005లో  బొంత దామోదర్ రావు   తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లాలో పాల డైయిరిని స్థాపించారని  ప్రియ  మిల్క్ ప్రోడక్ట్స్ ప్రై. లిమిటెడ్ సిఈఓ  కిషన్ రావు, డైరెక్టర్లు రామ్మోహన్ రావు, సునీల్ రావులు తెలిపారు. ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 20 సం.లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మాకు అండగా నిలిచిన రైతులకు, వినియోగదారులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదములు తెలిపారు. ప్రియ డైయిరీ, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం గల సిబ్బందితో రైతుల నుండి నాణ్యమైన పాలను సేకరిస్తుందని తెలిపారు.

ప్రియ మిల్క్ ప్రతి రోజు 300 గ్రామాలలో 10,000 వేల మంది రైతుల నుండి పాలు సేకరిస్తుందని  తెలిపారు.  ఇది రైతులకు వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయుటకు తోడ్పతున్నామని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు: సేకరించిన పాలను అత్యంత శుభ్రమైన పద్ధతుల ద్వారా శుద్ధిచేసి, వివిధ రకాల పాల ఉత్పత్తులుగా తయారుచేసి ఈ ఉత్పత్తులన్నీ భారతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు.  పాలు, పెరుగు, మజ్జిగ, లస్సి, నెయ్యి, బాదంపాలు, పన్నీరు, దూదేపేడ, బాసుంది, కోవాజామున్, ఉస్మానియా బిస్కెట్, ప్రియ బ్రెడ్ మరియు ప్రియ ఐస్క్రీములు యయారు చేస్తున్నట్టు తెలిపారు.  ప్రియ మిల్క్ అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి, పాల సేకరణ, ప్రాసెసింగ్ మరియు పంపిణీ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రియ మిల్క్ రైతులతో సహకార పద్ధతులను అనుసరిస్తుందని వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. 

స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నామని గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికవృద్ధికి దోహదం చేస్తున్నామని 250 మంది ప్రత్యక్ష సిబ్బంది మరియు 1900 మంది పరోక్షంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రియ మిల్క్, వినియోగదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తుందని, వారి అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తులను మెరుగుపరుస్తుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సేవలను విస్తరించడానికి అత్యాధునిక ప్లాంటుని నిర్మించబోతున్నామన్నారు. ప్రియ మిల్క్ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తుందని రైతులకు స్థిరమైన ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాలఉత్పత్తులు సమాజానికి సేవా ఇదే ప్రియ మిల్క్ యొక్క విజయానికి కారణమన్నారు. 

ప్రియ మిల్క్ కేవలం వ్యాపార సంస్థ మాత్రమే కాదు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటుందన్నారు.  ఆర్.జి రావు ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని మెరిట్ కలిగిన నిరుపేద విద్యార్థుల కొరకు 2007 నుండి నేటి వరకు సుమారు 20 వేల విద్యార్థులు లబ్ది పొందియున్నారని తెలిపారు.  ట్రస్ట్ ద్వారా MBBS, IIT, MBA, B.Tech మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులలో విద్యార్థులు చదువుతున్నారన్నారు. 2011లో హైదరాబాద్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్య గ్లోబల్ స్కూల్స్ స్థాపించి అవి దినదినాభివృద్ధి చెందుతూ నేడు 3 బ్రాంచులు మరియు 2026 మరో రెండు నూతన బ్రాంచుల కొరకు శరవేగంగా పనులు జరుగుతున్నవని తెలిపారు.