27-02-2025 08:19:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ పట్వారి బుక సాధులింబగిరి(102) గురువారం మృతి చెందారు. కుంటాల మండలంలో పట్వారిగా భూ సర్వేయర్ గా ఆయన ఎంతో మంది రైతులకు సేవలు అందించడంతో ఆయన మృతి పట్ల రైతులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. 102 సంవత్సరాలు పాటు జీవించిన ఆయన వారం రోజులుగా అనారోగ్యానికి గురై గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.