calender_icon.png 22 March, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈద్ ఉల్-ఫితర్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

21-03-2025 11:04:58 PM

వైరా ఏసిపి ఎంఏ రెహమాన్

వైరా,(విజయక్రాంతి): వైరా మున్సిపాలిటీ పరిధిలోని షేక్ బాబు జాని (ఎసీపీ రైటర్) ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఏసీపీ రెహమాన్ పాల్గొని మాట్లాడుతూ... కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ప్రజలందరూ రంజాన్ పండును ప్రశాంతంగా జరుపుకోవాలని వైరా ఏసిపి రెహమాన్ తెలిపారు. శుక్రవారం వైరా పట్టణంలో షేక్ బాబుజాని( ఏసిపి రైటర్) ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో  ఎంఏ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఖర్జూర పండ్లు తినిపించి ఉపవాస దీక్ష లను విరమించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సిసి అప్పారావు. వైరా మసీదు కమిటీ సదర్ షేక్ రసూల్, షేక్ మీరా షేక్ మీరా (కొండ) కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ అన్వర్, సయ్యద్ అతావుల్లా, ఫిరోజ్, రహీం ,బషీర్, గౌస్, తదితర ముస్లిం సోదరులు విందులో పాల్గొన్నారు.