అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల గొడవలకు సంబంధించి గ్రామంలో పోలీసులు విచారణకు వెళ్లారు. వైకాపా, టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు నిర్వహించారు. వైకాపా గ్రామస్థాయి నాయకలు ఇళ్లలో బాంబులు గుర్తించారు. అటు తాడిపత్రిలో వైకాపా, టీడీపీ చెందిన 90 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఉరవకొండ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలో ఉరవకొండ కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాంల్లో భారీగా గొడవలు జరిగిన విషయం తెలిసిందే.