calender_icon.png 26 February, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లిష్‌లోనూ టాక్సిక్ షూటింగ్

25-02-2025 12:00:00 AM

హీరో యష్, గీతూ మోహన్ దాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఇది కన్నడతోపాటుగా ఇంగ్లిష్‌లోనూ ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇలా ఇంగ్లిష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ కావడం గమనార్హం. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ప్రాంతీయ భాషకు వారు ప్రాధా న్యం ఇస్తూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ నారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజున సందర్భంగా రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ టీజర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా విషయమై గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. “విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం. మా ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నాం” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. “భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించే చిత్రంగా రూపొందిస్తున్నాం. మొదటి నుంచి ఈ కథపై మాకు ఎంతో నమ్మకం ఉంది” అన్నారు.