హైదరాబాద్: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్స్ వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం అందజేశారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్స్ చీఫ్ ఆఫీసర్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్ యాజమాన్యంకు అభినందనలు తెలియజేశారు.